పిల్లలను ప్రేమించడం కోసమే తల్లిదండ్రులు వారిని కంటారా?: అమృత

  • సంచలన వ్యాఖ్యలు చేసిన అమృత
  • తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తే పిల్లలు పుడతారన్న అమృత 
  • ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్న నెటిజన్లు
మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తే... పిల్లలు పుడతారని చెప్పింది. తల్లిదండ్రుల ప్రేమ ముఖ్యమా? లేక ప్రేమించిన వ్యక్తి ప్రేమ ముఖ్యమా? అనే విషయంపై ఆమె మాట్లాడుతూ... పిల్లలను ప్రేమించడం కోసమే వారిని కంటారా? అని ప్రశ్నించింది. వాళ్లు ఎంజాయ్ చేస్తే పిల్లలు పుడతారని వ్యాఖ్యానించింది. ఓ వార్తా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు స్పందించింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమృత వ్యాఖ్యలను పలువురు నెటిజెన్లు తప్పుబడుతున్నారు.
Go Back to Shorts
amrutha
pranay
parents
comments

More Telugu News